Tuesday, 28 July 2026 01:57:16 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

జనసేన నుండి ఓoగోలు బరిలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి !!!!

ముఖ్య అనుచరులతో మంతనాలు ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నియోజకవర్గం నుంచి బాలినేని తప్పుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు.

Date : 19 December 2023 08:27 AM Views : 1140

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : సీఎం జగన్ బంధువుల్లో ఒకరైన ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనానిగా మారుతున్నారా! అందులో భాగంగానే మొన్నటి రాత్రంతా ముఖ్య అనుచరులతో చర్చించినట్లు సమాచారం. తాజాగా శనివారం హైదరాబాద్‌లో ప్రాంతీయ సమన్వయ కర్త విజయసాయిరెడ్డితో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు లేదు. అందుకే బాలినేని జనసేనలో చేరి తిరిగి ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నియోజకవర్గం నుంచి బాలినేని తప్పుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సీఎం జగన్ సర్వేల్లో బాలినేనికి వ్యతిరేక గాలి వీస్తున్నట్లు వచ్చింది. దీంతో ఆయన్ని కూడా పక్కన పెట్టి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్థన్‌‌రావును దీటుగా ఎదుర్కోగల నేత కోసం పరిశీలించారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంను ఒంగోలు బరిలో దించాలనే ఆలోచనకు వచ్చారు. దీనికి బాలినేని సహకరించకపోవచ్చు. ఇలా నియోజకవర్గాన్ని నష్టపోవడం కన్నా ముందుగా బాలినేనితో చర్చించి ఆయన స్వతంత్రంగా పోటీ నుంచి తప్పుకుంటే పార్టీలో భవిష్యత్ ఉంటుందనే భరోసా ఇవ్వడానికి హైదరాబాద్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డితో బాలినేని చర్చల సారాంశం బయటకు రాలేదు. శుక్రవారం రాత్రి బాలినేని తన రాజకీయ భవిష్యత్తు గురించి అనుచరులతో చర్చించినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీలో చేరి ఒంగోలు నుంచి టీడీపీ–జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై మాట్లాడినట్లు సమాచారం. బాలినేనికి ఒంగోలు అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు పవన్ చంద్రబాబును ఒప్పించగలరా! బాలినేని జనసేనలో చేరడం ద్వారా వైసీపీలో ఏమేరకు ప్రభావం ఉంటుంది? టీడీపీని ఏళ్ల తరబడి కాపాడుకుంటున్న దామచర్ల జనార్ధన్ పరిస్థితేమిటి! ఆయన్ని అవసరాన్ని బట్టి ఎంపీగా బరిలోకి దింపుతారా లేక కందుకూరుకు పంపిస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మాజీమంత్రి బాలినేని వ్యవహారంపై మూడు పార్టీలు ఆచితూచి వ్యవహరించే అవకాశమున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: