Monday, 27 July 2026 01:27:50 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

అరుణాచలం అంటే -నమ్మకం,పాపాలు తొలిగిపోయి నిజమైన అగ్ని శివుడు

Date : 11 January 2024 07:32 PM Views : 1031

విశ్వాస్ టీవీ - తమిళనాడు / విజయవాడ : పంచ భూత లింగాలలో ఒకటైన అరుణాచం దేవాలయం చుట్టూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. అయితే ఈరోజునే ప్రదక్షిణ ఎందుకు చేయాలి.. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం... Arunachalam Temple దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగా క్షేత్రాలలో అగ్ని భూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని.. అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణ పాపాలను తొలగించునది అని అర్థం అని పండితులు చెబుతారు. అదే తమిళంలో అయితే ‘‘తిరువన్నామలై’’ అంటారు. శివ భక్తులు తిరువాన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. తిరు అంటే శ్రీ, అణ్ణామలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి.

అరుణాచలం క్షేత్రంలో పగలు, రాత్రి, సంధ్యా సమయం, ఎర్రని ఎండలో.. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. చలికి గజ గజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి పద్రక్షిణం చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్య లోక వాసులు కూడా తిరువాన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. www.viswastv అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల.. ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని చాలా మంది నమ్మకం. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలా మంది విశ్వాసం.... www.viswastv.com: గిరి ప్రదక్షిణ వేళ ఏమి చేయాలంటే.. అరుణాచల గిరి పద్రక్షిణం చేసేవారికి మోక్షం లభిస్తుందని.. కోరిన కోరికలన్నీ నెరువేరుతాయని చాలా మంది నమ్ముతారు. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది నమ్మకం. ఇలా ప్రదక్షిణకు వెళ్లే వారు ఏవైనా పండ్లను, నిమ్మకాయలను తీసుకెళ్లాలి

గిరి ప్రదక్షిణం చేసే వారు కచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్లాలి. బరువులు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకెళ్లకండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణం మొత్తం 14 కిలోమీట్ల వరకు ఉంటుంది. పగటిపూట ప్రదక్షిణ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఉదయం 10 గంటలలోపు గిరి పద్రక్షిణాన్ని ముగించాలి. ఎక్కువమంది పౌర్ణమి రోజే గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. మిగిలిన భక్తులు ప్రతిరోజూ గిరి ప్రదక్షిణం చేస్తారు. ఎలా చేరుకోవాలంటే.. తిరుపతి నుంచి 193 కిలోమీటర్ల దూరంలో.. బెంగళూరు నుంచి 202 కిలోమీటర్ల దూరంలో.. చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ----- ---------------(గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని కొంత వరుకు ‘విశ్వాస్ టీవీ ' దృవీకరించడం లేదు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: