Monday, 27 July 2026 01:21:15 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

చంద్రబాబుని కలిసిన వైస్సార్సీపీ ఎంపీపీ.... మన్యo జిల్లా పార్వతీపురం....

Date : 26 December 2022 12:48 AM Views : 994

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / పార్వతిపురం జిల్లా, : అభివృద్ధి చేయడానికి నిధులున్నప్పటికీ పనులు జరగకుండా సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నారని పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస వైసీపీ ఎంపీపీ బొంగు సురేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏమీ చెప్పలేకపోతున్నానన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును బొబ్బిలిలో కలిశారు. కురుపాం నియోజకవర్గంలో నెలకొన్న అవినీతి, అక్రమాలను బాబు దృష్టికి తీసుకెళ్లానని, చంద్రబాబు మన్యం పర్యటనకు వచ్చినప్పుడు తమ శ్రేణులతో మాట్లాడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబునాయుడు ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని రాజాం, బొబ్బిలి తదితర నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. వైసీపీ నిధులను దుర్వినియోగం చేస్తోందని, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని, ముఖ్యమంత్రి జగన్ కొట్టేసిన భూముల విలువ రూ.40వేల కోట్లు అంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఆరోపణలను జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి ఏం దోచుకున్నారో, ఏం ఆక్రమించుకున్నారో చెప్పాలని బాబుకు సవాల్ విసిరారు. విజయనగరం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదని, వైఎస్ వచ్చిన తర్వాత తోటపల్లి పూర్తయిందని గుర్తుచేశారు. తమ శాఖలపై విజయసాయి, సుబ్బారెడ్డి స్వారీ చేయడానికి మేమేమన్నా చిన్న పిల్లలమా? అని బొత్స ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పోటీగా తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాకు రూపకల్పన చేసింది. జిల్లాలవారీగా చంద్రబాబు పర్యటిస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జిలను, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: