Monday, 27 July 2026 01:20:43 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు..వాహ్ కేసీఆర్‌ వాహ్!నమ్మితే ప్రాణం పెట్టె మనసు మనం అనుకోని బ్రతికే పెద్ద ధీరుడు.....

Date : 10 April 2023 09:23 PM Views : 1027

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : KCR-వైజాగ్ STEEL రాష్ట్ర విభజనతో ఆంధ్రా ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచిన తెలంగాణ సిఎం కేసీఆర్‌, బిఆర్ఎస్‌ పార్టీతో మళ్ళీ ఆంద్రాలో అడుగుపెట్టాల్సివస్తుందని ఊహించి ఉండరు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి వేలుపెట్టి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కాకుండా నిలిచిపోయేలా చేయడంతో ఆంధ్రా ప్రజలు కేసీఆర్‌ మీద ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మలుచుకొనే చక్కటి అవకాశం ఎదురుగా కనిపిస్తుంటే, ఏపీలో ఎలా అడుగుపెట్టాలా… అని చూస్తున్న కేసీఆర్‌కి ఆయన కత్తులు దూస్తున్న మోడీ ప్రభుత్వమే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ రూపంలో చక్కటి అవకాశం కల్పించడం విశేషం. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు సరఫరా, నిర్వహణలో భాగస్వామ్యం, ప్లాంటులో ఉత్పత్తి అయిన ఉక్కును కొనుగోలుచేయడం కోసం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈవోఐ)ను ఆహ్వానించింది. “ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణలో తొలి అడుగు” అని నిరసన తెలియజేస్తూ తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ వారం రోజుల క్రితమే కేంద్రానికి ఓ పెద్ద లేఖ కూడా వ్రాశారు. కానీ తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఇప్పుడు ‘యూ టర్న్’ తీసుకొని ఈ ఈవోఐనే బిఆర్ఎస్‌ పార్టీ ఏపీలో అడుగుపెట్టడానికి ఓ గొప్ప రాజకీయ అవకాశంగా గుర్తించడం విశేషం. 1. తెలంగాణకు చెందిన సింగరేణి సంస్థ లేదా తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చేత గానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడి పెట్టించి దానిలో భాగస్వామిగా చేసిన్నట్లయితే, దానిని ప్రైవేట్ పరంకాకుండా కాపాడామని ఆంధ్రా ప్రజలకు చెప్పుకొని ఏపీలో అడుగుపెట్టవచ్చు. ప్రజలని ధైర్యంగా ఓట్లు అడగవచ్చు. 2. సింగరేణిలో కావలసినంత బొగ్గు గనులున్నాయి కనుక అక్కడి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేసి సింగరేణికి కూడా భారీగా ఆదాయం సమకూర్చవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఫ్లైఓవర్లు, స్టీల్ బ్రిడ్జిలు, భారీ భవనాలు నిర్మించబడుతున్నాయి. కనుక వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో తెలంగాణ సంస్థ భాగస్వామిగా ఉన్నట్లయితే వీటన్నిటికీ అవసరమైన స్టీల్ సరసమైన ధరలో పొందవచ్చు. 4. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని ఆదానీ గ్రూప్ సొంతం చేసుకొనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కనుక ఈవిదంగా ఆదానీని కూడా ఢీకొని మోడీ-ఆదానీల బారి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడనని సగర్వంగా చెప్పుకొనే అవకాశం కూడా కేసీఆర్‌కు లభిస్తుంది. ఈవోఐ ప్రక్రియకు ఈ నెల 15వ తేదీ గడువు కనుక నేడో రేపో తెలంగాణ ప్రభుత్వం తరపున వైజాగ్ రానున్నారు. వారు దీనిలో పాల్గొని వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ భాగస్వామిగా చేరేందుకు గల అవకాశాలను పరిశీలిస్తారు. ఆంద్రాలో అడుగుపెట్టడానికి కేసీఆర్‌కు ఇంతకంటే గొప్ప అవకాశం ఇంకేముంటుంది? అంటే ఒకే దెబ్బకు రెండు కాదు నాలుగు పిట్టలు కూతబోతున్నారన్నమాట! వాహ్ కేసీఆర్‌ వాహ్! చివరిగా ఒక ప్రశ్న: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడి పెట్టి ప్లాంట్‌ని, దానిలో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులను కాపాడుకోవచ్చు కదా? అది చేయదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్..... కష్టం అవసరం లేదు కదా....

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: