Tuesday, 28 July 2026 01:56:26 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

క్లాస్ రూములోనే ప్రాణాలు తుసుకున్న టీచరమ్మ ఎవరికి రాకూడదు.. ఇలాంటి పరిస్థితి

Date : 07 March 2023 06:13 PM Views : 981

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ప్రేమ పెళ్లిళ్లు కావచ్చు.. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కావచ్చు.. పెళ్లి తర్వాత 80 శాతం మంది ఆడపిల్లల జీవితాలు సంతోషంగా ఉండటం లేదు. భర్త లేదా అత్తింటి వారి వేధింపుల కారణంగా నిత్యం నరకం చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అనుమానం, అధిక కట్నం ఇలా ఏదో ఒక విషయంలో మహిళలు గృహ హింసకు గురవుతున్నారు. ఈ వేధింపులు తాళలేక భర్తనుంచి విడిపోయి వేరుగా ఉంటున్న వారు కొందరైతే.. ప్రాణాలు తీసుకుంటున్న వారు మరికొంతమంది. ఒక్కోరి కథ ఒక్కో విషాదం. అలాంటి విషాదాంతంలో బసమ్మ కథ కూడా ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆమెను అదనపు కట్నం కోసం వేధించాడు. అత్తింటి వారు కూడా భర్తకు తోడై నిత్యం ఇబ్బందిపెట్టే వారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

అది కూడా తాను పాఠాలు చెప్పే స్కూల్లో ‍ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని విజయనగర జిల్లా హూవిన హడగలికి చెందని బసమ్మ, అర్జున్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ వివాహం జరిగి 10 ఏళ్లు గడుస్తోంది. ఇద్దరూ హూవిన హడగలిలోని నేషనల్‌ కాలేజీలో టీచర్లుగా పని చేస్తున్నారు. ఆదివారం పరీక్ష విధులకోసం బసమ్మ కాలేజీకి వచ్చింది. పరీక్ష అయిపోయిన తర్వాత క్లాసు రూములోకి వెళ్లి గడియపెట్టుకుంది. విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. క్లాస్‌ రూములోకి వెళ్లిన బసమ్మ ఎంత సేపటికి బయటకు రాకపోయే సరికి తోటి ఉపాధ్యాయులకు అనుమానం వచ్చింది. వెంటనే క్లాసు తలుపుల పగులగొట్టారు.

లోపల బసమ్మ విగత జీవిగా కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన పోలీసులు బసమ్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం వైద్యశాలకు పంపించారు. బసమ్మ చనిపోయిన క్లాసురూములో పోలీసులకు ఓ సూసైడ్‌ నోట్‌ కనిపించింది. అందులో తన చావుకు గల కారణాలను బసమ్మ వివరించింది. భర్త, అత్త, ఆడపడచు వేధింపుల కారణంగా చనిపోతున్నట్లు రాసింది. వరకట్న వేధింపులు తాళలేక చనిపోతున్నట్లు పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: